భారతీయుడు-2 రన్ టైమ్ కాస్త ఎక్కువేగా?

July 05, 2024


img

కమల్ హాసన్‌-శంకర్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ భారతీయుడు-2 ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 3.04 గంటలు. ఇది కాస్త ఎక్కువే కానీ కమల్ హాసన్‌-శంకర్ ఇద్దరికీ ప్రేక్షకులను అంత సేపు థియేటర్లో కూర్చోబెట్టగలిగే సత్తా ఉంది. 

కమల్ హాసన్‌-శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తీశారు. 

భారతీయుడు-2లో ఎస్‌జె సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, సిద్ధార్ధ్, బాబీ సింహా, వివేక్, బాలీవుడ్‌ నటులు గుల్షన్ గ్రోవర్, పీయూష్ మిశ్రా, జాకీర్ హుస్సేన్, అఖిలేంద్ర మిశ్రా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, మనోబాల, ప్రియా భవానీ శంకర్, నెడుమూడి వేణు, ఢిల్లీ గణేశ్, జగన్, కాళిదాస్, జయరాం ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, డైలాగ్స్: హనుమాన్ చౌదరి, పాటలు: సుద్దాల అశోక్ తేజా, శ్రీమణి, కెమెరా: రవి వర్మన్, కొరియోగ్రఫీ: బోస్కో-సీజర్, బాబా భాస్కర్, యాక్షన్: అంభైరవ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, మేకప్: లీగసీ ఎఫెక్ట్స్, వాన్స్ హార్ట్ వెల్, పట్టణం రషీద్, ఏఆర్ అబ్దుల్ రజాక్ చేశారు. 

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయంట్ మూవీస్ బ్యానర్లపై సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష