అనిల్ రావిపూడితో విక్టరీ వెంకటేష్ ఎస్‌వీసీ58

July 04, 2024


img

విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారు. ఎస్‌వీసీ58 వర్కింగ్ టైటిల్‌తో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారు.

దీనికి బుధవారం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెంకటేష్, హీరోయిన్‌గా నటిస్తున్న మీనాక్షీ చౌదరిలపై క్లాప్ కొట్టగా, దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. ఐశ్వర్య రాజేష్ ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. 

ఇదో ముక్కోణపు క్రైమ్ స్టోరీ అని తెలియజేస్తూ, హీరోయిన్‌ మీనాక్షీ చౌదరి రివాల్వర్ పట్టుకున్న పోస్టర్ ఒకటి, అలాగే ఐశ్వర్య రాజేష్ ఫోటో, బ్యాక్ గ్రౌండ్లో మంగళ సూత్రాలు, రివాల్వర్, తూటాలు, రక్తపు మరకలు పక్కనే ఐపీఎస్ చిహ్నాన్ని చూపారు.   

 ఈ సినిమాకు కధ: ఎస్‌.కృష్ణ, జీ ఆదినారాయణ,  సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభిస్తామని అనిల్ రావిపూడి చెప్పారు.


Related Post

సినిమా స‌మీక్ష