పుష్ప కొత్త షెడ్యూల్ ఈవారం నుంచే షురూ

July 03, 2024


img

సుకుమార్-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో పుష్ప-2 సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తుంటే, ఆగస్ట్ 15న విడుదల కావలసిన సినిమాని డిసెంబర్‌ 6కి వాయిదా వేయడంతో చాలా నిరాశ చెందారు. అల్లు అర్జున్‌ చేయాల్సిన మరికొన్ని సన్నివేశాల షూటింగ్‌ పూర్తికాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టి ఇప్పటికే ఏడాదిన్నర పైనే అయ్యింది. కనుక మరోసారి వాయిదా పడకుండా ఉండేందుకు ఇకపై మరింత వేగంగా షూటింగ్‌ చేయాలని దర్శకుడు సుకుమార్ నిర్ణయించుకున్నారు. 

పుష్ప-2లో కూడా హీరోయిన్‌గా రష్మిక మందన నటిస్తోంది. ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతిబాబు ముక్యపాత్రలు చేస్తున్నారు.   

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ కలిసి ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష