బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి పెళ్ళికి తండ్రి గ్రీన్ సిగ్నల్‌

June 21, 2024


img

బాలీవుడ్‌లో కాస్త ముద్దుగా బొద్దుగా ఉన్న తనదైన శైలితో ప్రేక్షకులను మెప్పిస్తోంది సోనాక్షి సిన్హా. అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షాట్ గన్ శత్రుఘ్న సిన్హా ఏకైక ముద్దుల కూతురు. ఆమె చాలా కాలంగా తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌తో ప్రేమలో ఉంది. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు మీడియాకు తెలియజేసింది. 

ఇదేవిషయం మీడియా ప్రతినిధులు ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హాని అడిగితే “నా కూతురు పెళ్ళి చేసుకుంటోందా... నాకు తెలీదే ఎవరిని చేసుకుంటోంది? అని ఎదురు ప్రశ్నించడంతో కూతురు ప్రేమ, పెళ్ళి ఆయనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టమైంది. 

దీంతో మీడియాకు కావలసినంత మసాలా దొరికేసింది. వారి ప్రేమ, పెళ్ళి, తల్లితండ్రులతో విభేధాలు అంటూ బోలెడన్ని కధలు వండి వార్చేసింది. ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన శత్రుఘ్న సిన్హా దంపతులు, జహీర్ ఇక్బాల్‌ తల్లితండ్రులని ఇటీవల కలిసి వారి పెళ్ళి ఖాయం చేసేశారు. 

ఆ తర్వాత ఆయన కాబోయే అల్లుడుతో కలిసి ఫోటోలు, వీడియోలు దిగి మీడియాకు అందించేశారు. ఇప్పుడు మీడియా వారిద్దరి పెళ్ళి కబుర్లు వండివార్చుతోంది. ఈ నెల 23వ తేదీన సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహం ముంబైలో జరుగనుంది. కనుక సోనాక్షి సిన్హాకు లైన్ క్లియర్ అయిపోయిన్నట్లే. కనుక కాబోయియే భర్తతో కలిసి బాలీవుడ్‌లో అందరికీ శుభలేఖలు పంచుతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష