అమెజాన్ ప్రైమ్‌లో గంగం గణేశా...

June 20, 2024


img

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా క్రైమ్-కామెడీ చిత్రం ‘గంగం గణేశా’ మే 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో  ‘గంగం గణేశా’ చిత్రం ప్రసారం అవుతోంది.

ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆనంద్, ఇమ్మాన్యుయెల్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

చిల్లర దొంగతనలు చేస్తుండే గణేశ్ (ఆనంద్ దేవరకొండ) ఎప్పటికైనా ధనవంతుడు కావాలని అనుకుంటాడు. ఓ నగల దుకాణంలో ఏడు కోట్లు విలువ చేసే వజ్రాన్ని దొంగిలించేందుకు ఒక ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని తెలివిగా వజ్రాన్ని కొట్టేస్తాడు.

కానీ తాను ఎంతో రిస్క్ తీసుకొని కొట్టేసిన ఆ వజ్రాన్ని ఆ ముఠాకు ఎందుకు ఇవ్వడం? దానిని తానే అమ్మేసుకుంటే ధనవంతుడు అయిపోవచ్చు కదా? అనే ఆలోచనతో ఆ వజ్రాన్ని చెన్నైలో అమ్మేందుకు బయలుదేరుతాడు. 

కానీ దారిలో పోలీసులు వాహనాలు తనికీలు చేస్తుండటంతో ఆ వజ్రాన్ని అటుగా ఊరేగింపుగా తీసుకువెళుతున్న వినాయకుడి విగ్రహం తొండంలో పడేస్తాడు. మిగిలిన కధ అంతా ఆ విగ్రహం చుట్టూ తిరుగుతుంది. ఆ క్రమంలో గొడవలు, కామెడీ సీన్లు, ట్విస్టులు అందరినీ అలరిస్తాయి. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు గంగం గణేశా వచ్చేశాడు. 


Related Post

సినిమా స‌మీక్ష