కల్కి ఎడి2898 ట్రైలర్‌ ఇంత గొప్పగా ఉంటే...

June 11, 2024


img

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సిద్దమవుతున్న కల్కి ఏడి 2898 సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ముందుగా ప్రకటించిన్నట్లే సోమవారం ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు.

ట్రైలర్‌ చూస్తే హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉంది. దానికి భారతీయ పురాణాల నేపధ్యం, ప్రభాస్‌ మార్క్ యాక్షన్, కామెడీ జోడించడంతో ఇంకా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సినిమాలో విజువల్స్, గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.

ట్రైలర్‌ ఇంత గొప్పగా ఉందంటే ఇంక సినిమా మరెంత గొప్పగా ఉంటుందో అనిపించకమానదు. ట్రైలర్‌ చూసినవారు ఇక సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. అని ఆతృతగా ఎదురుచూసేలా ఉంది.

కల్కి ఎడి2898లో దీపికా పడుకొనే, దిశా పఠానీ హీరోయిన్లుగా చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్‌ నటుడు కమల్ హాసన్, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, పశుపతి, శాశ్వత చటర్జీ, అన్నా బెన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.      

రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి. అశ్వినీ దత్ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష