ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి ఎడి2898 సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా స్టోరీతోనే ఓ యానిమేషన్ వెబ్ సిరీస్ కూడా తీయాలనే ఆలోచన మొదట్లోనే వచ్చిందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. దానిని బుజ్జి & భైరవ పేరుతో దానిని రూపొందించామని చెప్పారు.
రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన కల్కి ఎడి2898 సినిమా ఇంకా విడుదల కాకముందే, అదే స్టోరీతో 2డి యానిమేషన్ సిరీస్‌ని ఓటీటీలో విడుదల చేయడం చాలా సాహసమే అని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. కానీ తమ సినిమాపై ఉన్న నమ్మకంతో బుజ్జి & భైరవ యానిమేషన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశామని చెప్పారు.
ఛోటా భీమ్ వంటి అనేక యానిమేషన్ సినిమాలు తీసిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కంపెనీతో కలిసి వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ యానిమేషన్ సిరీస్ తీశామని చెప్పారు.
కల్కి ఎడి2898 సినిమా, బుజ్జి వెహికల్ నిర్మాణం కోసం, బుజ్జి & భైరవ్ యానిమేషన్ వెబ్ సిరీస్ కోసం ‘వైజయంతీ ఆటోమొబైల్స్’ అనే ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేసుకొని రెంటినీ ఏకకాలంలో పూర్తి చేశామని నాగ్ అశ్విన్ చెప్పారు.