ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా.. హైనాన్న ట్రైలర్‌ 24న

November 21, 2023


img

ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతున్నందున, నాచురల్ స్టార్ నాని డిసెంబర్‌ 7న విడుదల కాబోతున్న తన ‘హైనాన్న’ సినిమా ప్రమోషన్స్ కోసం రాజకీయ నాయకుడిగా మారి సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో అందరినీ ఆకట్టుకొంటున్నారు. 

హై నాన్న సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ని అనుకరిస్తూ చేసిన ప్రెస్‌మీట్‌ వీడియోతో నాని చాలా ఆకట్టుకొన్నారు.

నాని సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, నాని కూతురుగా బాలీవుడ్‌ చైల్డ్ ఆర్టిస్ట్ కియరా ఖన్నా నటిస్తున్నారు. వీరి ముగ్గురి మద్య సాగే కధే హాయ్ నాన్నగా తెరకెక్కించారు.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల కలిసి ఈ ‘హాయ్ నాన్న’ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించారు. ఈ సినిమాతో శౌర్యూవ్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని, కొరియోగ్రఫీ: బోస్కో మార్టిస్, స్టంట్స్: విజయ్‌, పృధ్వీ. 



Related Post

సినిమా స‌మీక్ష