బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్

November 17, 2023


img

భగవంత్ కేసరితో హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ వెంటనే బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఊటీలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని దర్శకుడు బాబీ చెప్పారు. 

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ను ఎంచుకొన్నట్లు తెలుస్తోంది. మహానటి సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడిగా మారిపోయారు. అందమైన ప్రేమకావ్యం వంటి సీతారామం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898ఏడిలో కూడా దుల్కర్ ఓ కీలకపాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు మాస్ హీరో బాలయ్యతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవలసిందే.

ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష