మా అధ్యక్షుడుగా మంచు విష్ణు ఏంచేశాడు?

November 14, 2023


img

దాదాపు రెండేళ్ళ క్రితం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరుగగా మంచు విష్ణు అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికలను తలపిస్తున్నట్లు చాలా హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికలలో ప్రకాష్ రాజ్‌  ప్యానల్ ఓడిపోయింది.

ఆ ఎన్నికలలో తమ ప్యానల్ గెలిస్తే తన సొంత డబ్బుతో ‘మా’కు సొంత భవనం నిర్మిస్తానని మంచు విష్ణు హామీ ఇచ్చారు. కానీ మళ్ళీ ఎన్నికలొస్తున్నా ఇంతవరకు ఆ హామీ నెరవేర్చనే లేదని ప్రకాష్ రాజ్‌ విమర్శించారు.

అసలు ఈ రెండేళ్ళలో మంచు విష్ణు కనీసం ఒక్కసారి కూడా ‘మా’ సర్వసభ్య సమావేశం నిర్వహించలేదన్నారు. మా అధ్యక్షుడుగా మంచు విష్ణు అన్ని విదాలా విఫలమయ్యాడని, అసలు ఆయన ఎందుకు పోటీ చేశారో? ఎందుకు ఎన్నుకొన్నామో తెలీదని ప్రకాష్ రాజ్‌ అన్నారు. 

ఈసారి ‘మా’ ఎన్నికల సమయానికి తాను జాతీయ రాజకీయాలతో, తన సినిమా షూటింగ్‌లతో చాలా బిజీగా ఉంటానని కనుక తాను మళ్ళీ పోటీ చేయలేకపోవచ్చునని ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే ఈసారైనా ‘మా’ కోసం పనిచేయగల వ్యక్తినే అధ్యక్షుడుగా ఎన్నుకోవాలని హితవు పలికారు.          

మంచు మనోజ్ కారణంగా మంచు కుటుంబంలో ఏర్పడిన కొన్ని సమస్యలు, మంచు విష్ణు సినిమాలు ఫ్లాప్ అవుతుండటం వలన ‘మా’ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైన్నట్లు భావించవచ్చు.

కానీ ‘మా’కు సమయం కేటాయించనంత బిజీగా ఉండే పెద్దలను అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఎందుకు? బాధపడటం దేనికి?’మా’కు సమయం కేటాయించి పనిచేసేందుకు ఇండస్ట్రీలో చాలా మంది సిద్దంగా ఉన్నారు కదా?


Related Post

సినిమా స‌మీక్ష