లంగా ఓణీలో జాన్వీ, కుషీ కపూర్

November 11, 2023


img

ఏటా దీపావళి పండుగకు ముందు బాలీవుడ్‌ నిర్మాత కరణ్ జోహార్ ఇండస్ట్రీలో నటీనటులకు, టెక్నీషియన్లకు పార్టీ ఇస్తుంటారు. నిన్న ముంబైలో జరిగిన ఆ పార్టీకి బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్, ఆమె సోదరి ఖుషీ కపూర్ ఇద్దరూ సాంప్రదాయ దుస్తులలో హాజరయ్యి అందరి దృష్టిని ఆకర్షించారు. జాన్వీ కపూర్ ఊదా రంగులో లంగా ఓణీ ధరించగా, కుషీ కపూర్ లైట్ గ్రీన్ కలర్ లంగా ఓణి ధరించి పార్టీకి హాజరయ్యారు. దీంతో వారిద్దరినీ మీడియా ఫోటోగ్రాఫర్లు చకచకా ఫోటోలు తీశారు. సోషల్ మీడియాలో వారిద్దరి ఫోటోలు వైరల్ అయ్యాయి. 

జాన్వీ కపూర్ తెలుగులో తొలిసారిగా జూ.ఎన్టీఆర్‌కు జోడీగా దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ జాలారి కుటుంబానికి చెందిన పేద యువతిగా నటిస్తోంది. దేవర మొదటి భాగం 2024, ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష