ప్రభాస్ తొలిసారిగా పౌరాణిక సినిమా (ఆదిపురుష్) అదీ... శ్రీరాముడిగా చేస్తున్నాడని తెలిసినప్పుడు ఆయన అభిమానులే కాదు తెలుగు ప్రజలందరూ చాలా సంతోషించారు. దాని కోసం ఆతృతగా ఎదురుచూశారు. కానీ అది ఎంత నిరాశ పరిచిందో, ఎన్ని విమర్శలు ఎదుర్కొందో అందరికీ తెలిసిందే.
అయితే ప్రభాస్‌ని ఎవరూ తప్పు పట్టలేదు కానీ ఆ సినిమాని చిత్రవధ చేసిన దర్శకుడు ఓం రౌత్, దాని మాటల రచయిత మనోజ్ ముంతషీర్‌లను యావత్ దేశ ప్రజలు ఎంతగానో అసహ్యించుకొన్నారు... పరమ పవిత్రమైన రామాయణాన్ని అంత దారుణంగా తీసినందుకు చాలామంది వారిరువురినీ ద్వేషించారు కూడా.
ఆ విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, వాటిని భరించలేక తాను విదేశానికి పారిపోవలసి వచ్చిందని మనోజ్ ముంతషీర్ స్వయంగా చెప్పారు. అంతకు ముందు తాను చేసిన మంచి సినిమాలన్నిటినీ ప్రజలు మరిచిపోయారని, ఆదిపురుష్ సినిమా ఒక్కటే పట్టుకొని తనను ఓ ఆటాడుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆదిపురుష్ సినిమాని ఆవిదంగా హ్యాండిల్ చేయడం ఎంత పెద్ద పొరపాటో అప్పుడు కానీ తనకు అర్దం కాలేదన్నారు. ఇక ముందు అటువంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తపడతానని మనోజ్ ముంతషీర్ చెప్పారు. మరో సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని, ఈసారి ప్రేక్షకులను మెప్పించేందుకు గట్టిగా ప్రయత్నిస్తానని మనోజ్ ముంతషీర్ చెప్పారు.