ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్... బ్రష్ వేస్కో లిరికల్ రిలీజ్

November 10, 2023


img

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా నుంచి బ్రష్ వేస్కో... అంటూ సాగే లిరికల్ సాంగ్ ఈరోజు విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకు హారిస్ జయరాజ్ స్వరపరచగా సంజీత్ హెగ్డే హుషారుగా పాడారు. 

ఈ సినిమా డిసెంబర్‌ 22న విడుదల కావలసి ఉండగా అదే రోజున ప్రభాస్ సినిమా సలార్ విడుదలవుతుండటంతో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కాస్త ముందుగా అంటే డిసెంబర్‌ 8వ తేదీనే వచ్చేస్తున్నాడు. 

ఈ సినిమాలో డాక్టర్ రాజశేఖర్, రావు రమేష్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, అజయ్, అన్నపూర్ణమ్మ, పవిత్రా లోకేశ్, రవివర్మ, హైపర్ ఆది, వెంకటేష్ ముమ్ముడి, హరితేజ, సత్యశ్రీ, రూప లక్ష్మి, పృధ్వీ, సాహితి, శ్రీకాంత్ అయ్యర్, రోహిణి సత్యా కృష్ణన్, ప్రదీప్, పృధ్వీ, సుదేవ్ నాయర్, హర్ష వర్ధన్, తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వక్కంతం వంశీ, సంగీతం: హారీష్ జయరాజ్, కెమెరా: ఆర్ధర్ ఏ విల్సన్, జె.యువరాజ్, సాయి శ్రీరామ్, కొరియోగ్రఫీ: శేఖర్ విజే, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, స్టంట్స్‌: విజయ్‌, సిల్వా  చేస్తున్నారు. శ్రేష్టా మూవీస్ బ్యానర్‌పై ఎన్‌. సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. Related Post

సినిమా స‌మీక్ష