త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేష్ బాబు కాంబినేషన్‌లో జనవరి 12న వస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ‘దమ్ మసాలా’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది.
“ఎదురొచ్చే గాలి...ఎగరేస్తున్న చొక్కాపై గుండీ...” అంటూ మొదలయ్యే రామజోగయ్య శాస్త్రి వ్రాసిన పాటను తమన్ స్వరపరచగా, సంజీత్ హెగ్డే పాడారు.
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ, జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.