నూతన దర్శకుడు శౌర్యూవ్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ సినిమా నుంచి గాజుబొమ్మ అంటూ సాగే పాట ఈనెల 6న విడుదల కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ సినిమాలో నుంచి చిన్న వీడియో క్లిప్ నేడు సోషల్ మీడియాలో విడుదల చేశారు.
దానిలో నాని ఇంట్లో కేక్ తయారుచేస్తూ ఏదో కూనిరాగం తీస్తుంటే, పక్కనే కూర్చోన్న కూతురు లవ్ స్టోరీయా? అంటూ ప్రశ్నిస్తుంది. అవును అంటూ నాని కూతురిని ‘నా గాజుబొమ్మా’ అంటూ ప్రేమగా నుదుట ముద్దుపెట్టుకొంటాడు. ఈ సినిమా తండ్రీ కూతుర్ల బలమైన సెంటిమెంట్‌తో తీస్తున్నట్లు ‘హై నాన్న’ అంటూ టైటిల్‌తోనే చెప్పేశారు.
వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల కలిసి ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని, కొరియోగ్రఫీ: బోస్కో మార్టిస్, స్టంట్స్: విజయ్, పృధ్వీ.