సల్మాన్ ఖాన్‌ సినిమాలో జూ.ఎన్టీఆర్?

October 03, 2023


img

ఆర్‌ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్‌, జూ.ఎన్టీఆర్‌  ఇద్దరూ యావత్ దేశ ప్రజలను ఆకర్షించగలిగారు. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులను, బాలీవుడ్‌ ప్రముఖులను ఆకట్టుకోగలిగారు. అందుకే ఆర్‌ఆర్ఆర్ తర్వాత జూ.ఎన్టీఆర్‌కు హృతిక్ రోషన్ చేస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా వార్-2లో నటించే అవకాశం లభించింది. దాంతో తొలిసారిగా జూ.ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో నేరుగా ప్రవేశించబోతున్నారు. 

కానీ దాని కంటే ముందు మరో బాలీవుడ్‌ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి అవకాశం వచ్చిన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మన మల్లీశ్వరి కత్రీనా కైఫ్ జంటగా నటిస్తున్న టైగర్-3 సినిమాలో జూ.ఎన్టీఆర్‌ ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తాజా సమాచారం.

టైగర్ జిందాహై సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌ క్లైమాక్స్ సీన్‌లో ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. అంటే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ సడన్ ఎంట్రీ ఇచ్చిన్నట్లన్న మాట!

టైగర్-3లో షారూక్ ఖాన్ కూడా ఓ అతిధి పాత్రలో నటిస్తున్నారు. సూపర్ హిట్ వార్-2ని నిర్మించిన యష్ రాజ్‌ ఫిలిమ్స్ సంస్థే దీనిని కూడా నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే జూ.ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో స్ట్రెయిట్ హిందీ సినిమాలు చేసినా ఆశ్చర్యం లేదు.

జూ.ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రీదేవి కుమార్తె జాహ్నవీ కపూర్ టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఈ సినిమా 2024, ఏప్రిల్ 5వ తేదీన విడుదలకాబోతోంది.   


Related Post

సినిమా స‌మీక్ష