నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న విడుదలకాబోతోంది. కనుక ప్రమోషన్స్ వేగం పెంచుతూ 4వ తేదీన రెండో పాట, 8వ తేదీన ట్రైలర్ విడుదలచేయబోతున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ, కాజల్ కూతురుగా శ్రీలీల నటిస్తోంది. ఇటీవల విడుదలైన గణేశ్ ఏంథమ్, ఈ సినిమా మేకింగ్ వీడియోలకి మంచి స్పందన రావడంతో అభిమానులు ట్రైలర్, సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో రాంపాల్, శ్రవణ్, ప్రియాంకా జవల్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ శంకర్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: ఎస్ఎస్ ధమన్, కెమెరా: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్: వి వెంకట్ చేశారు.