నెట్‌ఫ్లిక్స్‌లోకి పోలిశెట్టి వచ్చేస్తున్నాడహో

October 01, 2023


img

అనుష్క, నవీన్ పోలిశెట్టి తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గత నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పి.మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టిల నటన, కామెడీ చక్కగా పండటంతో సినిమా ప్రేక్షకాధరణ పొందింది.

సినిమా విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల కనక వర్షం కురిసింది. సుమారు రూ.50 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. నవీన్ పోలిశెట్టి నటించిన ‘జాతిరత్నాలు’ సినిమా స్థాయిలో ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. చిరంజీవి, మహేష్ బాబు వంటి అగ్రనటులు సైతం ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంశించారు. 

కనుక థియేటర్లకు వెళ్ళలేకపోయినవారు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు త్వరలోనే ముగియనున్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రసారం కాబోతోంది. ఈవిషయం నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. 

ఈ సినిమాలో జయసుధ, మురళీశర్మ, నాజర్, అభినవ్ గోమాతమ్, సోనియా దీప్తి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష