సప్త సాగరాలు దాటి... అమెజాన్ ప్రైమ్‌లోకి!

September 29, 2023


img

కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా వచ్చిన ‘సప్త సాగరాలు దాటి-సైడ్ ఏ’ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదలై ‘ఓ అందమైన ప్రేమకావ్యం’గా మంచి టాక్ తెచ్చుకొంది. ఈ సినిమాకు థియేటర్స్ దొరకకపోవడంతో వారం రోజులు తిరక్కముందే అప్పుడే అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతమంచి సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేయడంతో ఓటీటీ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కన్నడలో ‘సప్త సాగర దాచె ఎల్లో: సైడ్ ఏ’ పేరుతో వచ్చిన ఈ సినిమాను తెలుగులో ‘సప్త సాగరాలు దాటి-సైడ్ ఏ’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. 

ఈ సినిమాకు దర్శకత్వం: హేమంత్ ఎం.రావు, సంగీతం: చరణ్ రాజ్, కెమెరా: అద్వైత గురుమూర్తి. 


Related Post

సినిమా స‌మీక్ష