బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా వస్తున్న భగవంత్ కేసరి సినిమా మేకింగ్ వీడియో కొద్ది సేపటి క్రితం విడుదలచేశారు. సినిమాలో ఎంతో ధ్రిలింగ్‌గా అనిపించే యాక్షన్ సీన్స్, ముఖ్యంగా కార్ ఛేజింగ్ సన్నివేశాలను ఏవిదంగా చిత్రీకరిస్తారో ఈ మేకింగ్ వీడియోలో చూపారు. అవి చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
ఈ సినిమాలో బాలకృష్ణ, కూతురుగా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. గణేశ్ నవరాత్రీ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో వారిద్దరిపై ‘చిచ్చా వచ్చిండు...’ అంటూ సాగే ఓ అద్భుతమైన వీడియో సాంగ్‌ని విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, ప్రియాంకా జవల్కర్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: ధమన్, కెమెరా: సి.రాంప్రసాద్, స్టంట్స్: వి వెంకట్, ఎడిటింగ్: వి తమ్మిరాజు చేస్తున్నారు.
షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న దసరా పండుగకి ముందు విడుదలకాబోతోంది.