అచ్చమైన తెలుగింటి హీరోయిన్‌గా కలర్స్ స్వాతిని తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా ఆదరించలేదు కానీ తమిళ సినీ పరిశ్రమ అక్కున చేర్చుకొంది. దీంతో ఆమె ఎక్కువగా తమిళ సినిమాలే చేసుకొంటూ తెలుగు ప్రేక్షకులకు దూరమైంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాతో మన ముందుకు వస్తోంది.
శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర, శ్రేయ నావిలే, మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర, రాఘవ్, రుచిత సాదినేని, మౌర్య సిద్దవరం, కంచరపాలెం కిషోర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 6వ తేదీన విడుదల కాబోతున్నందున ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే చాలా బలమైన భావోద్వేగాలతో కూడిన కధలా అనిపిస్తుంది.
ఈ సినిమాకు సంగీతం:అచు రాజమని, కెమెరా: రాజీవ్ ధరావత్, ఎడిటింగ్: రవికాంత్ పారెపు, ఆర్ట్: ఈతలపాక చంద్రమౌళి చేస్తున్నారు.
ఈ సినిమాని కృషివ్ ప్రొడక్షన్స్, హాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై రఘువర్మ పేరూరి సహ నిర్మాతగా యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు.