మంచు విష్ణు కన్నప్ప సినిమా షూటింగ్ ప్రారంభం కాకమునుపే హీరోయిన్ నుపూర్ సనన్ తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో తాను కూడా నటించబోతున్నట్లు మధుబాల తెలిపారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం తెలియజేస్తూ, ఈ సినిమాలో నయనతార కూడా నటించబోతోందని తెలియజేశారు. ఈ సినిమాకు ప్రభాస్, నయనతార కలిశారంటే అంచనాలు పెరిగి పెద్ద సినిమాగా మారుతుందని వేరే చెప్పక్కరలేదు
స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకుడుగా వ్యవహరించబోతున్నారు.
కన్నప్ప సినిమాకు సంగీతం: మణిశర్మ మరియు స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్ డైరెక్టర్: చిన్న.
ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ న్యూజిలాండ్‌లో మొదలుపెడతామని తెలియజేశారు.