సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బెదురులంక

September 22, 2023


img

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన బెదురులంక 2012 ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. నెలరోజులు తిరక్క ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచే అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ప్రసారం అవుతోంది. 

క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాలో అజయ్ ఘోష్, ఎల్బీ శ్రీరామ్, శ్రీకాంత్ ఘోష్, గోపరాజు రమణ, సత్య, జబర్ధస్త్ రాంప్రసాద్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

సినిమా టైటిల్లో పేర్కొన్నట్లే ఈ కధ 2012లో ఓ పల్లెటూరులో జరుగుతుంది. 2012లో యుగాంతం అవుతుందని మీడియాలో వచ్చిన వార్తలు వచ్చాయి. వాటి ఆధారంగానే దర్శకుడు క్లాక్స్ ఈ కధని ఓ గ్రామంలో అద్భుతంగా, చాలా వినోదాత్మకంగా తెరకెక్కించారు. రాబోయే విపత్తుని అడ్డుకొంటామని చెపుతూ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ), బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్) డేనియల్ (రాంప్రసాద్) చేసే కామెడీ బాగా పండటంతో సినిమా హిట్ అయ్యింది.


Related Post

సినిమా స‌మీక్ష