చాలా కాలంగా సరైన హిట్ లేక ఢీలా పడిన మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’కు ఇటీవల కొబ్బరికాయ కొట్టి త్వరలోనే న్యూజిలాండ్‌లో రెగ్యులర్ షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకొంటున్నాడు.
ఈ సినిమాలో విష్ణుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపూర్ సనన్‌ను తీసుకొన్నారు. కానీ ఆమె ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేనని తప్పుకొన్నారు. ఈ విషయం మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేశారు.
అయితే ఆమె నిజంగానే ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకొందా లేక మంచువిష్ణు సినిమాలో చేయవద్దని ఎవరైనా టాలీవుడ్‌లో ఆమె చెవిలో ఊదారో తెలీదు. ఎందుకంటే టాలీవుడ్‌లో కొందరు సినీ ప్రముఖులు పనిగట్టుకొని తనపై బురద జల్లుతున్నారని, తన సినిమా గురించి దుష్ప్రచారం చేసి దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని మంచు విష్ణు కొన్ని రోజుల క్రితమే ఆరోపించారు. కారణం ఏదైనప్పటికీ మళ్ళీ కొత్త హీరోయిన్ కోసం మంచు విష్ణుకు వెతులాట తప్పదు.
స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకుడుగా వ్యవహరించబోతున్నారు.
ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మించబోతున్నారు.
కన్నప్ప సినిమాకు సంగీతం: మణిశర్మ మరియు స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్ డైరెక్టర్: చిన్న చేయబోతున్నారు.