కల్కి ఏడి 2898 కాపీ కొడితే కేసులు తప్పవు

September 21, 2023


img

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటానీ వంటి అగ్రనటీనటులతో తెరకెక్కుతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది. రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌  దీనిని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తోంది. కనుక ఈ సినిమా విడుదల కాకముందే పైరసీదారులను హెచ్చరిస్తూ ట్విట్టర్‌లో నేడు ఓ హెచ్చరిక నోటీస్ జారీ చేసింది.

“కల్కి ఏడి 2898 సినిమాపై కాపీరైట్ హక్కులు వైజయంతీ మూవీస్‌కు మాత్రమే ఉన్నాయని కనుక ఈ చిత్రాన్ని కానీ దానిలో కొంత భాగాన్ని గానీ, దీనికి సంబందించి ఫోటోలు, వీడియోలు, పాటలను ఎవరైనా లీక్ చేసినా, ఇతరులతో పంచుకొన్నా వారిపై సైబరాబాద్ పోలీసుల సహకారంతో కాపీరైట్ చట్టం-1957 ప్రకారం చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి,” అని నోటీసులో హెచ్చరించింది. 

కల్కి ఏడి 2898 సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు చాలా పెరిగిపోయాయి. కనుక సినిమాకు సంబందించి ఎటువంటి సమాచారమైనా పైరసీదారులకు కాసులు కురిపిస్తుంది. అందుకే వైజయంతీ మూవీస్‌ ముందుగానే ఈ హెచ్చరిక జారీ చేసింది. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.         Related Post

సినిమా స‌మీక్ష