రామ్ పోతినేని, శ్రీలీల జోడీగా తెరకెక్కుతున్న ‘స్కంద’ సినిమా ఈ నెల 28న విడుదల కాబోతోంది. కనుక తాజాగా ఈ సినిమా నుంచి ‘కల్ట్ మావా...’అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. అనంత్ శ్రీరామ్ వ్రాసిన ఈ పాటను తమన్ స్వరపరచగా హేమ చంద్ర, రమ్య బెహ్రా, మహాలు పాడారు. ఈ పాటను రామ్, ఊర్వశీ రౌతేలా బృందంపై చిత్రీకరించారు.
మంచి సాహిత్య విలువలు కలిగిన పాటలు వ్రాయగల అనంత్ శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి వంటివారు చివరికి ఇలాంటి పాటలు వ్రాసుకొనే దుస్థితికి దిగజారడం బాధాకరమే. ఇక సంగీత దర్శకుడు తమన్ ఎప్పటిలాగే మూస బాణీ, మూస బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగా, రామ్, ఊర్వశీ బృందం హుషారుగా డాన్స్ చేసింది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: ధమన్, కెమెరా: సంతోష్ డేటకే, స్టంట్స్: స్టంట్ శివ, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్.
ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/l6Lo0D0Zm5I?si=SlyxFdESc8ORwto7" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" allowfullscreen></iframe>