ఉస్తాద్ సంగతి నేను చూసుకొంటా... నువ్వు చదువుకో తమ్ముడూ!

September 20, 2023


img

హరీష్ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఉస్తాద్భగత్ సింగ్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే మద్యలో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకోసం ఏపీకి వెళ్ళిపోతుండటంతో ఇంతవరకు ఈ సినిమా షూటింగ్‌ పూర్తికాలేదు. ఈవిషయం అభిమానులకుకూడా తెలుసు.

ఇందుకు సంతోషించాలో బాధపడాలో తెలీడంలేదు వారికి. ఎందుకంటే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో యాక్టివ్‌గా ఉంటే ముఖ్యమంత్రిఅయ్యే అవకాశం పెరుగుతుంది. అదే సినిమాలలో యాక్టివ్‌గా ఉంటే వరుసపెట్టి సినిమాలు విడుదలవుతుంటాయి.హిట్స్ పడుతుంటాయి. కానీ తమ అభిమాన హీరో రెండు పడవల ప్రయాణం చేస్తూ అటు సినిమాలు,ఇటు రాజకీయాలలో కూడా నష్టపోతున్నారని అభిమానులు బాధపడటం సహజం. అయితే పవన్‌ సినీఅభిమానులకు ఈ రాజకీయాలతో పనిలేదు. కనుక పవన్‌ సినిమాలు త్వరగా పూర్తవ్వాలని కోరుకొంటారు.

అటువంటి అభిమానే ఒకరు హరీష్ శంకర్‌ని ఉద్దేశ్యించి,“ఉస్తాద్ భగత్ సింగ్‌ 50 శాతమే షూటింగ్‌ పూర్తయిందట కద అన్నా?ఇంకా క్వాలిటీ ఆ దేవుడి మీదే భారం వేశాము,” అంటూవ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

దానికి హరీష్ శంకర్‌ కూడా వ్యంగ్యంగానే బదులిస్తూ,“అంతే కదా తమ్ముడూ అంతకు మించి నువ్వేమి చేయగలవు చెప్పూ?ఈలోగాకాస్త నీ కెరీర్, ఉద్యోగం, చదువుల మీద దృష్టిపెట్టు. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు... ఆల్ ది బెస్ట్!” అని ట్వీట్ చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష