నాగ చైతన్య నటించిన థాంక్ యూ, కస్టడీ రెండు సినిమాలు నిరాశపరచడంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని తన 23వ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. చందూ మొండేటి దర్శకత్వంలో నిర్మించబోతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వాస్తవ జీవితాలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం వెళ్ళి అక్కడ మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని వారితో కలిసి భోజనాలు కూడా చేశారు. కనుక ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడుగా నటించబోతున్నట్లు భావించవచ్చు.
గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో తెలియజేస్తూ పెట్టిన వీడియోలో సాయి పల్లవి కూడా కనబడింది. కానీ ఆమె మొహం చూపకుండా వెనక వైపు నుంచి చూపుతూ హీరోయిన్‌గా అమేనా కాదా? అనే సస్పెన్స్ క్రియేట్ చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి ఇదివరకు ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.