మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ హైదరాబాద్, కోఠి వద్దగల విమెన్స్ కాలేజీలో మూడు రోజులపాటు జరిగింది. దీనిలో మహేష్ బాబు చేయవలసిన సన్నివేశాలు లేనందున ఆయన పాల్గొనలేదు. దాంతో కాలేజీలో సిబ్బంది ముఖ్యంగా విద్యార్ధినులు చాలా నిరాశపడ్డారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ తదితరుల మీద కాలేజీలో కొన్ని సన్నివేశాలు ఘాట్ చేశారు.
అక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే ఓ స్టార్ హోటల్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ సుమారు 4-5 రోజులు షూటింగ్ జరగవచ్చని తెలుస్తోంది. ఇక్కడ జరిగే షూటింగ్‌లో మహేష్ బాబు కూడా పాల్గొనబోతున్నారు. షూటింగ్ జరుగుతున్న తీరు చూసిన వారందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా వేగంగా పూర్తి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. శ్రీలీల ఒకేసారి అనేక సినిమాలు ఒప్పుకొన్నందున, ముందుగా మీనాక్షి చౌదరిపై సన్నివేశాలు చాలా వరకు పూర్తిచేసి, శ్రీలీల వచ్చినప్పుడు ఆమె పాత్రకు సంబందించి సన్నివేశాలు పూర్తిచేస్తున్నారు.
ఈ సినిమాలో జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
గుంటూరు కారం సినిమా 2024, జనవరి 12న సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.