అయ్యో... మహేష్ బాబు జాతీయ అవార్డు చేజార్చుకొన్నారే!

August 25, 2023


img

పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందారు. దీంతో అల్లు అర్జున్‌, కుటుంబ సభ్యులు, అభిమానులు, పుష్ప దర్శకుడు సుకుమార్, పుష్ప యూనిట్ సభ్యులు అందరూ సంబురాలు చేసుకొంటున్నారు. తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు అల్లు అర్జున్‌కు ఫోన్లు చేసి, ట్వీట్స్ ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. 

నిజానికి దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని మహేష్ బాబుతో చేయాలనుకొని ఈ కధ వినిపించారు. అయితే అది నచ్చకపోవడంతో మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించారు. అదే విషయం తెలియజేస్తూ 2019, మార్చి 4వ తేదీన ట్వీట్‌ చేశారు కూడా. 

“క్రియేటివ్ డిఫరన్ససస్ కారణంగా సుకుమార్‌తో ఈ సినిమా చేయలేకపోతున్నాను. ఈ సినిమా (పుష్ప-ది రైజ్) ప్రారంభించిన్నట్లు ప్రకటించిన సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. సుకుమార్ ఓ గొప్ప దర్శకుడు. ఆయన పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఆయనతో చేసిన ‘వన్ నేనొక్కడినే’ సినిమా ఓ మంచి క్లాసిక్ చిత్రం. ఆ సినిమా చేస్తున్నప్పుడు ప్రతీ క్షణం నేను చాలా ఆస్వాదించాను,” అని మహేష్ బాబు ట్వీట్‌ చేశారు. 

పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ అయినప్పుడు కూడా అభిమానులు మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ ఓ మంచి అవకాశం మిస్ చేసుకొన్నారని బాధపడ్డారు. ఇప్పుడు అదే సినిమాతో అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు కూడా లభించడంతో మళ్ళీ మరోసారి ఆనాడు మహేష్ బాబు చేసిన ఆ ట్వీట్‌ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. 

కానీ సినీ పరిశ్రమలో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కనుక అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు లభించినందుకు మహేష్ బాబు కూడా అభినందనలు తెలిపారు. 



Related Post

సినిమా స‌మీక్ష