వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళి నిశ్చయమేనా?

June 01, 2023


img

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి ఈ నెల 9న వివాహ నిశ్చితార్ధం జరుగబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. కానీ ఇంతవరకు మెగా ఫ్యామిలీ స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదివరకు వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని ఊహాగానాలు వినిపించినప్పుడు ఇద్దరూ ఖండించారు. కానీ ఈసారి ఖండించడం లేదు.

కానీ కొన్ని రోజుల క్రితం విలేఖరులు నాగబాబుని వరుణ్ తేజ్ పెళ్ళి గురించి అడిగినప్పుడు, “త్వరలోనే చేసుకొంటాడు. పెళ్ళి తర్వాత వేరే ఇంట్లోకి షిఫ్ట్ అవుతాడు,” అని అన్నారు. కనుక జూన్ 9న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహ నిశ్చితార్ధం ఖాయమనే భావించవచ్చు.  

కనుక సోషల్ మీడియాలో మళ్ళీ వారి పెళ్ళి ముచ్చట్లు మొదలైపోయాయి. ప్రస్తుతం వాళ్ళిద్దరూ విదేశాలలో షాపింగ్ చేస్తున్నారని, జూన్ 9న హైదరాబాద్‌లో ఓ స్టార్ హోటల్లో జరుగబోయే వారి వివాహ నిశ్చితార్ధం కార్యక్రమానికి మెగా ఫ్యామిలీలో అందరూ హాజరుకాబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం వరుణ్ తేజ్ తాను ఇటలీలో ఉన్నట్లు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు, లావణ్య త్రిపాఠి కూడా తాను విదేశాలలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. కనుక ఇద్దరూ కలిసి ఇటలీలొ ఎంజాయ్ చేస్తున్నారని అందరూ భావిస్తుండటం సహజమే కదా?


Related Post

సినిమా స‌మీక్ష