త్వరలో భోళాశంకర్‌ హంగామా షురూ

May 30, 2023


img

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జంటగా సిద్దం అవుతున్న భోళాశంకర్‌ సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలవబోతున్నాయి. అతి త్వరలోనే భోళాశంకర్‌ సినిమా పాటలు వరుసగా విడుదల చేయబోతున్నట్లు ఈ సినీ నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నేడు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ సందర్భంగా ‘భోళామానియా స్టార్ట్స్ సూన్’ పేరుతో ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. దానిలో మెగాస్టార్ చిరంజీవి ఓ గ్రూప్ డ్యాన్స్‌లో పాల్గొంటున్నట్లు చూపారు. 

ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తుండగా మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఆగస్ట్ 11న సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో షూటింగ్‌ జరుగుండగానే మరోపక్క డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేస్తున్నారు. 

భోళాశంకర్‌ కూడా వాల్తేర్ వీరయ్యలాగే మాస్ ఎంటర్‌టైనర్. కనుక దీనిలో కూడా చిరంజీవి డ్యాన్సులు, పంచ్ డైలాగులు, కామెడీ, ఫైట్స్ అన్నీ పుష్కలంగా ఉండబోతున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)ని తెలుగులో భోళాశంకర్‌ పేరుతో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ అందిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష