రీల్ లైఫ్ లవ్... రియల్ లైఫ్ లవ్: సిద్దార్థ్ అసహనం

May 29, 2023


img

ప్రముఖ నటుడు సిద్దార్థ్ ఒకప్పుడు వరుసగా అనేక హిట్ సినిమాలు అందించాడు. వాటిలో చాలా వరకు లవ్ స్టోరీలే. కనుక లవర్ బాయ్‌గా మంచి పేరు సంపాదించుకొన్నాడు. కానీ చాలా కాలంగా హిట్ పడకపోవడంతో క్రమంగా కనుమరుగు అయిపోయాడు. మళ్ళీ శర్వానంద్‌తో కలిసి సముద్రం వంటి సీరియస్ సినిమాలో సీరియస్ పాత్ర చేశాడు. కానీ ఆ సినిమా బాగా ఆడకపోవడంతో సిద్ధూ తీవ్ర నిరాశ చెందాడు. తాజాగా కార్తీక్ దర్శకత్వంలో టక్కర్ అనే సినిమాతో జూన్ 9న మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో సిద్ధూకి జోడీగా దివ్యాంశ్ కౌశిక్ నటించింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో సిద్ధూ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సిద్దూ సినిమాలలో లవర్ బాయ్‌గా ప్రేక్షకులను మెప్పించినప్పటికీ, నిజ జీవితంలో ప్రేమలో విఫలమయ్యాడు. సిద్దూ, సమంతలు కొంతకాలం ప్రేమించుకొని, శ్రీకాళహస్తి ఆలయంలో కలిసి పూజలు కూడా చేశారు. కానీ ఆ తర్వాత ఆమె అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడటంతో సిద్దూ లవ్ ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత నుంచి సిద్ధూ రీల్ లైఫ్‌లో తప్ప నిజజీవితంలో మళ్ళీ లవ్ ట్రాక్స్ లేకుండా పోయాయి. ఇదే విషయం ఓ విలేఖరి అడిగితే, సిద్దూ కాస్త అసహనం వ్యక్తం చేస్తూ, “నా లవ్ అఫైర్స్ గురించి నాకంటే మీకే భాగా తెలుసు. నాకంటే మీరే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు కదా? మళ్ళీ అడగడం దేనికి? కావాలనుకొంటే మరోసారి వేరేగా మాట్లాడుకొందాము గానీ ఇప్పుడు మాత్రం కాదు,” అని అన్నాడు. 

సముద్రం సినిమాని చాలా ఇష్టపడి, కష్టపడి చేసినప్పటికీ అది ఫ్లాప్ అవడం చాలా బాధ కలిగించిందని సిద్దూ అన్నారు అది హిట్ అయ్యుంటే తర్వాత వెంట వెంటనే మరికొని సినిమాలు చేసి ఉండేవాడినని సిద్దూ అన్నారు. కానీ ఇక నుంచి తప్పనిసరిగా ప్రతీ 3-4 నెలలకు ఓ సినిమా పూర్తిచేస్తానని సిద్దూ చెప్పాడు.  టక్కర్ సినిమా పూర్తిగా కమర్షియల్ సినిమా అని చెప్పాడు. 

ఈ సినిమాలో యోగిబాబు, అభిమన్యు సింగ్, మునిష్కంత్, విగ్నేష్ కాంత్ తదితరులు నటించారు. సుదర్శన్ సుందరం, జి. జయరాం కలిసి ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ ఏజీ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం: నివాస్ కె ప్రసన్న, కెమెరా: వంచింతన్ మురుగేషన్, స్తంట్స్: దినేష్ కాశీ, ఎడిటింగ్: జీఏ గౌతమ్ చేశారు.               


Related Post

సినిమా స‌మీక్ష