రామ్-బోయపాటి సినిమా ఓ నెల ముందే విడుదల

May 27, 2023


img

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జోడీగా తెరకెక్కిస్తున్న సినిమాకు సంబందించి చిన్న అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ముందు ప్రకటించగా, ఒక నెల ముందుగా సెప్టెంబర్‌లోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రామ్ కెరీర్‌లో తొలిసారిగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు. కమర్షియల్, మాస్ మసాల సినిమాలు తీయడంలో మంచి పేరున్న దర్శకుడు బోయపాటి దీనిని అదేవిదంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మాస్ మసాలా సినిమాతో రామ్ వంటి ఎనర్జీటిక్ హీరోను ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకోవడం మంచి ఆలోచనే కానీ నేటివిటీ లేకుండా చుట్టేస్తే హిందీ ప్రేక్షకులు తిరస్కరించే ప్రమాదం కూడా ఉంటుంది. దర్శకుడు బోయపాటికి ఈ విషయం బాగానే తెలుసు కనుక ఆ ప్రకారమే తీస్తున్నారని ఆశిద్దాం.       

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు బోయపాటి శ్రీను కధ సమకూర్చుకొన్నారు. సంగీతం: తమన్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, యాక్షన్: స్టంట్స్ శివ, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష