మార్చి 24 నుంచి ఓటీటీలోకి బలగం వచ్చేస్తోంది

March 23, 2023


img

జబర్దస్త్ షోలో... ఆ తర్వాత సినిమాలలో మంచి హాస్య నటుడుగా మంచి పేరు సంపాదించుకొన్న వేణు తనలో ఎవరూ గుర్తించని దర్శకుడిని బలగం సినిమాతో పరిచయం చేశారు. ఆ సినిమాని చూసి చిరంజీవి వేణుని ప్రత్యేకంగా తన భోళా శంకర్ సెట్స్‌కు పిలిపించుకొని మరీ అభినందించారు. సినీ ఇండస్ట్రీలు పలువురు నటులు, దర్శకులు, ప్రముఖులు వేణు ప్రతిభని చూసి ఆశ్చర్యపోయారు. అభినందించారు. ఎందుకంటే ఓ హాస్య నటుడు దర్శకుడుగా మారినా కామెడీ సినిమా తీస్తాడని అందరూ ఆశిస్తారు తప్ప ఇటువంటి గంభీరమైన కధాంశంతో చక్కటి సినిమా తీస్తాడని ఊహించలేకపోవడం వలన. తెలంగాణ పల్లె నేపధ్యంలో సాగే ఈ సినిమాలో మానవ సంబంధాలు, సంస్కృతీ సంప్రదాయాలు, తెలంగాణ గ్రామీణ ప్రజల జీవనశైలి అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. ఈ సినిమా మార్చి 3వ తేదీన థియేటర్లలో విడుదలై హిట్ కొట్టింది. కానీ నెల రోజులు కాక మునుపే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఒకేసారి అమెజాన్ ప్రైమ్‌,  సింప్లీ సౌత్  ఓటీటీలలో ప్రసారం కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష