కళ్యాణ్ రామ్ మరో హిట్... పక్కా?

February 04, 2023


img

బింబిసార వంటి చారిత్రిక నేపద్యం గల కధని వర్తమానంతో జోడించి అద్భుతమైన ఫ్యాంటసీ చిత్రాన్ని అందించిన నందమూరి కళ్యాణ్ రామ్‌, ఇప్పుడు ఏకంగా మూడు పాత్రలతో ‘అమిగోస్’ అనే విలక్షణమైన టైటిల్, కధాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిన్న విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌లో ఒకే పోలికతో ఉన్న ముగ్గురులో ఒకరు మిగిలిన ఇద్దరినీ చంపాలనుకోవడం, వారిలో ఒకరు అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్‌ని వేటాడే హీరోగా చూపారు. ట్రైలర్‌ చూస్తే 50 శాతం యాక్షన్ మిగిలిన దానిలో సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ ఉన్నట్లనిపిస్తుంది. ట్రైలర్‌ చూస్తే ఇది రొటీన్ కధాంశం కాదని కూడా అర్దమవుతుంది. కనుక కళ్యాణ్ రామ్‌ బింబిసార తర్వాత మరో సూపర్ హిట్ ఇవ్వబోతున్నట్లనిపిస్తోంది

రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా ఆషికా రంగనాధ్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నెని, వ.రవిశంకర్ ఈ సినిమాని నిర్మించారు. ఈ నెల 10న అమిగోస్ విడుదల కాబోతోంది. Related Post

సినిమా స‌మీక్ష