ఎన్టీఆర్‌-కొరటాల సినిమా మరో చిన్న అప్‌డేట్

February 02, 2023


img

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ తన 30వ సినిమాచేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబందించి ఓ చిన్న అప్‌డేట్ యువసుధ ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ‘అడవితల్లి పెంచిన యోధుడు... సంద్రాన్ని పాలించే ధీరుడి కధ మరికొద్ది రోజులలో మొదలు...’ అంటూ ఎన్టీఆర్‌ ఫోటోతో చిన్న సందేశం పెట్టింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు దానిలో పేర్కొంది. 

ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్‌ సినిమా పూర్తిచేసి చాలా కాలమే అయినప్పటికీ ఇంతవరకు మరో సినిమా మొదలుపెట్టకపోవడంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా మొదలుపెట్టినా ఇది మరో 14 నెలల వరకు రిలీజ్‌ కాదని తెలిసి నిరాశ చెందుతున్నారు. కొరటాలతో ఈ సినిమా ప్రకటించి చాలా కాలమే అయినప్పటికి సినిమాకి సంబందించి ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు. 

ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ధృవీకరించవలసి ఉంది. 

ఈ సినిమాని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమా కోసం నిర్మాత బండ్ల గణేశ్ రిజిస్టర్ చేసుకొన్న ‘దేవర’ టైటిల్ ఈ సినిమాకి ఇచ్చిన్నట్లు సమాచారం కానీ ఈ వార్తని ఖరారు చేయవలసి ఉంది.   

ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందించబోతున్నారు.

 Related Post

సినిమా స‌మీక్ష