నాని దసరా టీజర్‌... రఫ్ అండ్ టఫ్!

January 30, 2023


img

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ మార్చి30వ తేదీన దసరా సినిమా వస్తోంది. ఈ సినిమాలో నాని సింగరేణి కార్మికుడుగా నటిస్తున్నారు. నానికి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమా కధ పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలోని ఓ పల్లెటూరులో సాగుతుంది. కనుక అక్కడే ఈ సినిమాకి సంబందించి కొన్ని ముఖ్య సన్నివేశాలని షూట్ చేశారు కూడా. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్, రోషన్ మాథ్యూస్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈరోజు దసరా టీజర్‌ విడుదలైంది. దానిలో నాని వేషధారణ, బాడీ లాంగ్వేజ్ చూస్తే పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ గుర్తుకు రాకమానరు. నాని నటిస్తున్న ఈ దసరా సినిమాకి తొలిసారిగా బడ్జెట్‌ రూ.65కోట్లు పెట్టి తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు. 

తెలుగు ఒరిజినల్ వెర్షన్‌ టీజర్‌ని రాజమౌళి, తమిళ్: ధనుష్, కన్నడ: రక్షిత్ శెట్టి, మలయాళం: దుల్కర్ సల్మాన్, హిందీ టీజర్‌ని షాహిద్ కపూర్ విడుదల చేశారు.  

ఈ సినిమాకి ఎడిటింగ్: నవీన్ నూలి, సంగీతం: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ అందిస్తున్నారు.

 


Related Post

సినిమా స‌మీక్ష