అతి త్వరలో ఎన్టీఆర్‌-కొరటాల మూవీ రెగ్యులర్ షూటింగ్‌ షురూ

January 28, 2023


img

ఎన్టీఆర్‌ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పూర్తి బౌండ్-స్క్రిప్ట్ తో కొరటాల శివ సిద్దంగా ఉన్నారట! ఈ సినిమాని ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్‌ చేస్తామని ముందే ప్రకటించినందున ఒకసారి షూటింగ్‌ మొదలుపెడితే ఎక్కడా ఆగకుండా శరవేగంగా సినిమాని పూర్తిచేయాలని భావిస్తున్నారు. 

ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో ఓ భారీ సెట్ సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. దీనిలోనే టాకీ పార్ట్ కొంతవరకు పూర్తి చేసి, ఫైట్స్, డ్యూయెట్ సాంగ్స్ కోసం విదేశాలకి వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్‌ మూవీ తర్వాత ఇంతవరకు మరో సినిమా చేయలేదు కానీ రామ్ చరణ్‌ అప్పుడే శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని పూర్తి చేసి మరో రెండు సినిమాలని లైన్లో పెట్టారు కూడా. కనుక ఎన్టీఆర్‌ కూడా ఇక స్పీడ్ పెంచబోతున్నారు. ఫిభ్రవరి రెండోవారంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంబించవచ్చని తెలుస్తోంది. 

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా అలనాటి మేటి నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ సినిమా కోసం నిర్మాత బండ్ల గణేశ్ రిజిస్టర్ చేసుకొన్న ‘దేవర’ టైటిల్ ఈ సినిమాకి ఇచ్చిన్నట్లు సమాచారం కానీ ఈ వార్తని ఖరారు చేయవలసి ఉంది.   

ఈ సినిమాని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి ప్రముఖ కెమెరామ్యాన్ రత్నవేల్‌ పనిచేస్తున్నారు. సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందించబోతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష