ఎన్టీఆర్‌, ఏఎన్నార్ దూరం పెట్టినా నెగ్గుకొచ్చిన జమున

January 27, 2023


img

సినీ పరిశ్రమలో అగ్రహీరోలతో విభేదాలు ఏర్పడితే ఏ నటీనటులు నిలద్రొక్కుకోవడం చాలా కష్టం. కానీ అలనాటి మేటినటి జమున మాత్రం చిత్రసీమలో నెగ్గుకొచ్చారు. ఆనాటి అగ్రహీరోలుగా ఉన్న ఎన్టీఆర్‌, ఏఎన్నార్ ఇద్దరూ ఆమెని సుమారు ఏడాదిపాటు తమ సినిమాలలో తీసుకోలేదు. నిజానికి జమునకి ఎన్టీఆర్‌తో ఎటువంటి విభేదం ఏర్పడలేదు. కానీ ఇల్లరికం సినిమాలో ఏఎన్ఆర్‌తో ఏదో విషయంలో చిన్న మాటామాటా అనుకొన్నారు. దాంతో ఆయన ఈ విషయం ఎన్టీఆర్‌కి చెప్పడంతో ఆయన కూడా జమునని దూరం పెట్టారు. 

గమ్మతైన విషయం ఏమిటంటే ఆమెతో సినిమా చేయకూడదని ఎన్టీఆర్‌ అనుకొన్నప్పటికీ ఇదివరకే ఒప్పుకొన్న సినిమాల కోసం ఆమెతో కలిసి నటించవలసి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కొంతకాలం ఆమెని దూరం పెట్టారు. అప్పటికే జమునకి మంచి పేరు సంపాదించుకోవడంతో ఆమె ఏ మాత్రం భయపడలేదు. జగ్గయ్, కృష్ణ, కృష్ణంరాజు, హరనాద్‌ తదితరులతో సినిమాలు చేసుకొంటూపోయారు తప్ప వారిని అవకాశం ఇమ్మనమని బ్రతిమాలుకోలేదు. 

అయితే ప్రజలు ఎన్టీఆర్‌-జమున, ఏఎన్ఆర్‌-జమున కాంబినేషన్‌లో సినిమాల కోసం ఎదురుచూస్తున్నారని గ్రహించిన విజయ స్టూడియో అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి ఆమెని వెంటబెట్టుకొని వారిద్దరితో రాజీ కుదిర్చారు. వెంటనే ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న గులేభకావళి సినిమాలో జమునని హీరోయిన్‌గా తీసుకొని సినిమా ప్రారంభించేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మరెన్నడూ వారి ముగ్గురి మద్య విభేధాలు ఏర్పడలేదు. ఇద్దరు హీరోల కాంబినేషన్‌లో జమున అనేక సూపర్ హిట్ సినిమాలు చేశారు. వాటిలో ఎవ్వర్ గ్రీన్ సినిమా గుండమ్మ కద. నేటికీ తెలుగు ప్రజలని రంజింపజేస్తూనే ఉంటుంది. 


Related Post

సినిమా స‌మీక్ష