శాకుంతలం నుంచి మరో గీతం... ఋషివనంలోన

January 25, 2023


img

సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్‌ శకుంతల, దుష్యంతులుగా నటించిన శాకుంతలం సినిమా నుంచి మరో సంగీత ప్రధానమైన ఋషీవనంలోన... స్వర్గధామం... అనే లిరికల్ వీడియో సాంగ్‌ని ఈరోజు విడుదల చేశారు. శ్రీమణి వ్రాసిన ఈ పాటకి కీరవాణి స్వరపరచగా చిన్మయి, సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇంతకు ముందు విడుదల చేసిన మల్లికా మల్లికా... అనే పాటతో పోలిస్తే ఈ పాట అంతగా ఆకట్టుకోకపోయినా, ఇదొక రొమాంటిక్ సిట్యువేషనల్ సాంగ్‌ కనుక సినిమా చూడకుండా పాటని ఇప్పుడే తక్కువగా అంచనా వేయడం సరికాదు.  

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. శాకుంతలం సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా ఫిభ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష