శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ సినిమా ఖరారు

January 25, 2023


img

యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేయబోతున్న సినిమాకి ‘సైందవ్’ అని టైటిల్‌ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో వెంకటేష్ చేస్తున్న పాత్ర పేరు సైందవ్ అని ఈరోజు విడుదల చేసిన ఫస్ట్-లుక్‌ పోస్టర్‌లో తెలియజేశారు. వెంకటేష్ చేతిలో గన్‌ పట్టుకొని ఉండగా బ్యాక్ గ్రౌండ్‌లో మంటల్లో తగలబడుతున్న ఓ కారుని ఆ పోస్టర్‌లో చూపారు. 

ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించబోతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకటేష్ బోయినపల్లి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ నిర్మించబోతున్నట్లు శైలేశ్ కొలను తెలిపారు. ఇది వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.      



Related Post

సినిమా స‌మీక్ష