కోలీవుడ్‌లో ఒకేరోజు ఇద్దరు దర్శకులు మృతి

January 25, 2023


img

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, నటుడు ఈ.రామదాస్ (66) సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనని హాస్పిటల్‌కి తరలించారు. కానీ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రామదాస్‌కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం ఉదయం చెన్నైలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

సోమవారమే కోలీవుడ్‌లో సహాయ దర్శకుడుగా చేస్తున్న రామకృష్ణన్ (25) కూడా చనిపోయారు. ధగ్స్ అనే చిత్రానికి చెన్నైకి సమీపంలోని సాలిగ్రామంలో గల ఓ స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న రామకృష్ణన్ హటాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. స్టూడియో సిబ్బంది వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయిన్నట్లు వైద్యులు చెప్పారు. ఆయన కూడా గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

ఒకేరోజు ఇద్దరు దర్శకులు మరణించడంతో కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. కోలీవుడ్‌లో ప్రముఖులు ఇరువురికీ నివాళులు అర్పిస్తున్నారు.      



Related Post

సినిమా స‌మీక్ష