మేజర్ సర్జరీలయ్యాయి... కొలుకొంటున్నా: విజయ్‌ ఆంటోని

January 25, 2023


img

బిచ్చగాడు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ నటుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా బిచ్చగాడు-2 (తమిళంలో పిచ్చైకారన్ 2) తీస్తున్నాడు. ఇటీవల మలేషియాలో ఆ సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు సముద్రంలో బోట్ ఛేజింగ్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నప్పుడు, విజయ్‌ ఆంటోని నడుపుతున్న స్పీడ్ బోట్ వేరే బోట్‌ని బలంగా ఢీకొంది. ఆ ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయపడ్డాడు. దవడ ఎముక విరిగిపోయింది. మొహానికి తీవ్ర గాయాలయ్యాయి. విజయ్‌ ఆంటోని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి కూడా. అయితే అతనికి ప్రాణాపాయం లేదని అప్పుడే అతని సన్నిహితులు చెప్పారు. వైద్యులు ఆయనకి అవసరమైన శస్త్ర చికిత్సలు చేసారు. 

విజయ్‌ ఆంటోని స్వయంగా ట్విట్టర్‌లో ఈవిషయం తెలియజేసాదు. హాస్పిటల్‌ బెడ్ మీద నుంచే ‘థంబ్స్ అప్’ చెపుతున్న ఓ ఫోటోని కూడా పెట్టి, “డియర్ ఫ్రెండ్స్ మలేషియాలో  పిచ్చైకారన్ 2 షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు జరిగిన ప్రమాదంలో నా దవడ, ముక్కుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తయ్యింది. నేను కొలుకొంటున్నాను. త్వరలోనే మీ అందరితో ముఖాముఖీ మాట్లాడతాను. నాకు అండగా నిలిచిన మీ అందరికీ థాంక్స్” అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష