శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ సినిమా ఖరారు

January 23, 2023


img

‘హిట్ యూనివర్స్’ సీరీస్‌లో భాగంగా హిట్-1,2,3 అంటూ దర్శకుడు శైలేశ్ కొలను వరుసగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్నారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకటేష్ బోయినపల్లి ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు శైలేశ్ కొలను తెలిపారు. ఈ సినిమాకి సంబందించి వెంకటేష్ ఫోటోతో ఓ పోస్టర్‌ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిలో ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలని ఈనెల 25వ తేదీన ప్రకటిస్తానని  శైలేశ్ కొలను తెలిపారు. ఇది వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రం. తనపై నమ్మకం ఉంచి ఈ బాద్యత అప్పగించినందుకు వెంకటేష్ గర్వపడేలా సినిమా తీస్తానని శైలేశ్ కొలను ట్వీట్‌ చేశారు.   Related Post

సినిమా స‌మీక్ష