మేలో భోళాశంకర్‌ రిలీజ్?

January 23, 2023


img

వాల్తేర్ వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న సినిమా భోళా శంకర్‌. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఇంకా మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా భోళా శంకర్‌ ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. వాల్తేర్ వీరయ్య హడావుడి పూర్తయినందున ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాని ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ముందుగా ప్రకటించినప్పటికీ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం.


Related Post

సినిమా స‌మీక్ష