రష్యన్స్ యువతులు కూడా సామి ఓ సామి... బంగరు సామికి ఫిదా!

December 02, 2022


img

అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమా రష్యన్ భాషలో డబ్బింగ్ చేసి డిసెంబర్‌ 8వ తేదీన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యన్ భాషలో విడుదల చేసిన పుష్ప ట్రైలర్‌ మంచి ఆదరణ పొందుతోంది. దర్శకుడు సుకుమార్‌తో కలిసి అల్లు అర్జున్‌, రష్మిక మందన తదితరులు రష్యాకి చేరుకొని అక్కడా పుష్ప సినిమా ప్రమోషన్స్‌ మొదలుపెట్టేశారు. 

రష్యాలో కూడా పుష్ప పాటలకి, ముఖ్యంగా ఆ సినిమాలో డ్యాన్సులకి, అల్లు అర్జున్‌ ట్రేడ్ మార్క్ డైలాగ్ ‘తగ్గేదేలే...’కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఆ సినిమాలో అల్లు అర్జున్‌, రష్మిక మందనల “ఓ సామి... నా సామి... మీసాల సామి... బంగరు సామి...’ పాటకు రష్యన్ యువతులు ఎంతగా ఫిదా అయిపోయారంటే మాస్కో నగరంలో రోడ్ల మీద కొంతమంది ఆ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి చూపారు. ఆ ముచ్చట మీరు చూడండి మరి! 

 


Related Post

సినిమా స‌మీక్ష