అమెజాన్ ప్రైమ్‌లో మంచు అబ్బాయ్ జిన్నా

December 02, 2022


img

మంచు హీరోలు మంచు మనోజ్, మంచు విష్ణు ఇద్దరూ కొన్ని హిట్స్ ఇచ్చారు కానీ నేటికీ నిలద్రొక్కుకోలేక వెనకబడిపోయారు. వారిలో మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోనీ ప్రధాన పాత్రలలో జిన్నా సినిమా చేశాడు. మంచు విష్ణు దానిపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. కానీ మంచు విష్ణు కెరీర్‌లోనే జిన్నా అట్టర్ ఫ్లాప్‌ మూవీగా నిలిచింది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా జిన్నా దెబ్బ తినడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రేపటి నుంచి ప్రసారం కాబోతోంది.   

ఈ సినిమాకి ముందు మంచు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా కూడా ఇలాగే దారుణంగా దెబ్బ తింది. చాలా థియేటర్లలో ప్రేక్షకులు లేక ప్రదర్శనలు నిలిపివేయవలసి వచ్చింది కూడా. దాని తర్వాత మోహన్ బాబు నిర్మించి, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి కూడా ఎదురుదెబ్బతగలడంతో మంచు ప్రతిష్ట కరిగిపోతోంది. 

ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా క్లోజింగ్ కలెక్షన్స్ రూ.58 లక్షల షేర్ (గ్రాస్ రూ.1.51 కోట్లు) మాత్రమే వచ్చాయి. మోహన్ బాబు రాజకీయాలు, సినీ ఇండస్ట్రీతో మంచు కుటుంబానికి సఖ్యత లేకపోవడం, సినిమాకి 'జిన్నా' అని టైటిల్ పెట్టడం తదితర అంశాలు ఈ సినిమాపై ప్రభావం చూపి ఉండవచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష