శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రిక్షా తొక్కుకొని జీవించే ఓ తండ్రి పాత్రలో రామ్ చరణ్‌కి జోడీగా అంజలి నటిస్తుండగా, ఐఏఎస్ అధికారి పాత్రకి జోడీగా కియరా అద్వానీ నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం లొకేషన్ ఫోటోలు కొన్ని లీక్ అవడంతో ఈ విషయం బయటకి పోక్కింది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ స్వయంగా న్యూజిలాండ్ లో తీసిన కొన్ని లొకేషన్ ఫోటోలను మీడియాకి రిలీజ్ చేశారు.
సుమారు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు అందించిన కధతో రూపొందున్న ఈ సినిమాకు ‘అధికారి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.
ఈ సినిమాకి కెమెరా తిరు, ఆర్ రత్నవేలు, థమన్ సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, విశాఖపట్నం, మహారాష్ట్ర, పంజాబ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. 2023, వేసవి సెలవులలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.