వాళ్ళు నా పెళ్లి ముహూర్తం పెట్టేయకముందే చెప్పేస్తున్నా: కృతి సనన్

November 30, 2022


img

ఆదిపురుష్‌ సినిమాలో సీతాదేవిగా నటించిన కృతి సనన్, ఆ సినిమాలో శ్రీరాముడిగా నటించిన ప్రభాస్‌తో ప్రేమలో పడిందని గత మూడు రోజులుగా పుకార్లు వస్తున్నాయి. వాటిపై ఆమె స్పందిస్తూ, “నేను ఎవరితోను ప్రేమలో లేను. అవన్నీ పుకార్లే. అసలు ఇటువంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో తెలీదు. బేడియా హిందీ సినిమా ప్రమోషన్స్‌లో వరుణ్ ధావన్ ఏదో సరదాకి అన్న మాట పట్టుకొని కొన్ని వెబ్‌సైట్లు ఈ పుకార్లు పుట్టించినట్లున్నాయి. నేను స్పందించడం ఇంకా ఆలస్యం చేస్తే ఆ వెబ్‌సైట్ల వాళ్ళు నా పెళ్ళి ముహూర్తం కూడా పెట్టేసేలా ఉన్నారు. అందుకే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇలా మీడియా ముందుకి వచ్చి ఆ పుకార్లను ఖండించాల్సివస్తోంది,” అని కృతి సనన్ చెప్పారు. 

ఇటీవల బేడియా సినిమా ప్రమోషన్స్‌లో వరుణ్ ధావన్, కృతి సనన్ పాల్గొన్నప్పుడు ఓ ప్రశ్నకు వరుణ్ సమాధానంగా “ప్రస్తుతం దీపికా పడుకొనేతో సినిమా చేస్తున్న ఓ పాన్ ఇండియా హీరో మనసులో కృతి సనన్ ఉంది. అందుకే నేను ఆమె పేరును నా జాబితాలో పెట్టుకోలేదు,” అని అన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌, దీపికా పడుకొనే ప్రాజెక్ట్-కె సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కనుక కృతి సనన్‌, ప్రభాస్‌ ప్రేమలో పడ్డారని చెప్పడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. 

సినిమా ప్రమోషన్స్‌లో ఈవిదంగా మాట్లాడేసి అవన్నీ మీడియా సృష్టిస్తున్న పుకార్లే అని చెప్పడం పరిపాటిగా మారిపోయింది. ఈ పుకార్లపై ప్రభాస్‌ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇటువంటి పుకార్లు పుట్టిస్తూ, తమ అభిమాన హీరో ప్రభాస్‌ ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష